వైసిపి గుర్తులతో ఉన్న షర్ట్స్‌, టోపీలు స్వాధీనం

May 4,2024 00:20
స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

ప్రజాశక్తి -హుకుంపేట:హుకుంపేట గ్రామ జంక్షన్‌లో వైసిపి గుర్తులతో ఉన్న షర్ట్స్‌ -752, టోపీలు 2000, స్టికర్‌ ప్యాకెట్‌లను మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండాక్ట్‌ అధికారి రోణంకి వెంకటరావు, రాపిడ్‌ యాక్సన్‌ ఫోర్స్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సదరు సామాగ్రి, కారుతో పాటు డ్రైవర్‌, పార్టీ కార్యకర్త కాపు మాధవరావుని అదుపులోనికి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సతీష్‌ పేర్కొన్నారు ఎన్నికల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

➡️