ఘనంగా అంబేద్కర్‌ జయంతి

Apr 14,2024 22:11

ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ, ఎస్‌సి ఉద్యోగుల సంఘం నాయకులు పి.అప్పయ్య, ఆర్‌.వరప్రసాద్‌, అంబేద్కర్‌ పోరాట సమితి అద్యక్షులు సొరు సాంబయ్య వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంతో పేదలకు న్యాయం జరుగుతుందని నాయకులు అన్నారు.రోటరీ ఆధ్వర్యంలో : అంబేద్కర్‌ గొప్ప దార్శినికుడని ప్రభుత్వ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ రామ్‌ నరేష్‌ అన్నారు. ఆదివారం అంబెడ్కర్‌ 133 వ జయంతిని రోటరీ కార్యాలయంలో రోటరీ ఆధ్వర్యంలో అధ్యక్షులు జెసి రాజు నిర్వహించారు. ముఖ్య అధితిగా హాజరైన ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ జి. రామ్‌ నరేష్‌, రోటరీ ఉపాధ్యక్షులు కె నాగరాజులు అంబెడ్కర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు సింద్రీ శ్రీనివాసన్‌, కె రామకృష్ణ, జి.శంకర రావు, దుర్గ ప్రసాద్‌, చంటి తదితరులు పాల్గొన్నారు.పూసపాటిరేగ: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అన్నారు. అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా పేరాపురంలో సీనియర్‌ పాత్రికేయులు, కెవిపిఎస్‌ నాయకులు తాలాడ బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పేరాపురం సర్పంచ్‌ రౌతు శ్రీరామ్‌ మూర్తి, పూసపాటిరేగ సర్పంచ్‌ టొంపల సీతారాములు, పేరాపురం మాజీ సర్పంచ్‌ బొంతు ఉమ, మాజీ ఎంపిటిసి వలిరెడ్డి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌ బొంతు రవికుమార్‌, వైసిపి నాయకులు కోరాడ మహేష్‌ పాల్గొన్నారు.వేపాడ: సీనియర్‌ దళిత నాయకుడు కొమరపల్లి ఏసుదాసు, దళిత మహాసభ అధ్యక్షుడు రాము సింగరాయ గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువకులు మహిళలు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. మండంలోని వావిలపాడులో సర్పంచ్‌ దంపతులు బీల సతీస్‌, రాజేశ్వరి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బూడి వెంకటరావు, నాగిరెడ్డి రాజునాయుడు, జై భీమ్‌ కార్యకర్తలు కణితి చిన్నా, వేమాద్రి కిరణ్‌, కొమ్మాది దేవి తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్‌ఐలు అప్పారావు, చిన్నయ్య, హెడ్‌ కానిస్టేబుళ్లు, పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.వంగర: సమ సమాజ స్థాపనకు, నవ సమాజ నిర్మాణానికి భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఎంతగానో కృషి చేశారని ఎస్‌.ఐ వైవి జనార్ధన్‌ కొనియాడారు. అంబేద్కర్‌ 133వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దళిత బహుజన జెఎసి ఆధ్వర్యంలో వంగర, లక్షింపేట, శివ్వాం, అరసాడ, పట్టు వర్ధనంతో పాటు పలు గ్రామాలలో డప్పు వాయిద్యాలతో ఆదివారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ. వై.వి జనార్దన్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎస్‌ఐ చేతుల మీదుగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన జెఎసి ఉత్తరాంధ్ర అధ్యక్షుడు మజ్జి గణపతి, దళిత సేన రాష్ట్ర కార్యదర్శి ఎం గణపతిరావు, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చిత్తిరి గంగులు, డిరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.గుర్ల: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె. వి. సూర్యనారాయణ రాజు, జిల్లా ఎఐఎం కార్యదర్శి కెల్ల భీమారావులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి లోగిస రామకృష్ణ గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలో పెనుబర్తి, చింతపల్లి పేట, తెట్టంగి తదితర పంచాయతీలలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్‌ కన్వీనర్‌ బెల్లాన బంగారునాయుడు, ప్రసాద్‌, ఎఐఎం సభ్యులు పాల్గొన్నారు.చీపురుపల్లి: లావేరు రోడ్డులో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి విజయగనరం ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలను యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.నెల్లిమర్ల: స్థానిక రామతీర్థంలో కూడలిలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగిశ రామకృష్ణ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జంతు సంక్షేమం విద్యార్థులు బాధ్యత అనే అంశం పై రామతీర్థం జంక్షన్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటిల్లో నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు పట్టణ అధ్యక్షుడు అదపాక రాంబాబు, ఉపాధ్యక్షుడు గురుమూర్తి, కోశాధికారి బూసర రవి, విద్యార్థి సంఘ నాయకులు లోగిశ అక్షరు, నితిన్‌, తదితరులు పాల్గొన్నారు.టిడిపి ఆధ్వర్యంలో: అంబేద్కర్‌ జయంతి సందర్భంగా టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్లమెంట్‌ కార్యదర్శి లెంక అప్పలనాయుడు, రాష్ట్ర ఎస్‌సి సెల్‌ అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, బెల్లాన రాజినాయుడు, రెడ్డి వేణు, లోగిస శ్రీను, వానపల్లి వీరభద్రరావు, రెల్లి వెంకటేష్‌, బెల్లాన అప్పలనాయుడు, పిల్ల శ్రీను తదితరులు రామతీర్థం కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.శృంగవరపుకోట: అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మండలంలోని ధర్మవరం గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డెరైక్టర్‌ వాకాడ రాంబాబు, వైసిపి మండల అద్యక్షుడు మోపాడ కుమార్‌, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకట రమణ, జెసిఎస్‌ ఇంచార్జి వాకాడ సతీష్‌, కూనిరెడ్డి వెంకటరావు తదితరులు పాల్గొన్నా రు.పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దామోదర శ్రీధర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిమిడి గ్రామ సర్పంచ్‌ వబ్బిన తిరునాధమ్మ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిటిసి ధర్మారావు, జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు పాల్గొన్నారు. పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యనిర్వాహణా ధికారి కన్నబాబు ఆధ్వర్యంలో, ఎస్‌టియు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్‌టియు కొత్తవలస మండల అధ్యక్షుడు ప్రేమ సీతారాం అంబేద్కర్‌ జీవిత చరిత్ర పుస్తకం పంపిణీ చేశారు. ఓటర్‌ అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యారావు, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ సంతోష్‌ కుమారి పట్టణంలోని ప్రకాష్‌ మార్కెట్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు.తెర్లాం: రిటైర్డ్‌ ఆర్‌టిఒ బి వెంకట్రావు జగన్నాధవలస గ్రామంలో, పెరుమాలి సర్పంచ్‌ ప్రతినిధి ఎస్‌ అప్పల నరసింహారాజు పెరుమాలిలో, తెర్లాం, డి.గజబవలస, కొల్లివలస గ్రామాల్లో ఆయా గ్రామ పెద్దలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెర్లాం సర్పంచ్‌ రూప, ఎంపిటిసి జి ఆనందరావు, జి వెంకట్రావు, బి మురళీకృష్ణ పాల్గొన్నారు.జామి: జామి ఎస్‌సి కాలనీలో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చిప్పాడ లక్ష్మి, దళిత సంఘం నాయకులు బోని జీవన్‌, ఉపాధ్యాయులు ఇప్పాక నాగరాజు, కృష్ణ, రామచధ్రుడు, కాలనీ వాసులు, పెద్దలు పాల్గొన్నారు.రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో సర్పంచ్‌ గుడుమూరు పట్టాభి, రైతు సంఘం నాయకులు నారు జనార్ధన రావు, టిడిపి నాయకులు గుణుపూర్‌ రాము, మజ్జి రాముడు పేట గ్రామంలో రాజన్న, ఉంగరాడ మెట్ట వద్ద ఎస్‌సి, ఎస్‌టి టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎంఇఒ ఎం వరప్రసాదరావు, జ్యోతి, బూరాడ గ్రామంలో జై భీమ్‌ అధ్యక్షులు మోహన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.విజయనగరం టౌన్‌ : జిఎస్‌ఆర్‌ కాంప్లెక్సులో అంబేద్కర్‌ చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వజ్రపు నవీన్‌కుమార్‌, ఎంటి రాజేష్‌, ఎం.పవన్‌ కుమార్‌, ఎం.శ్రీను, సిహెచ్‌ కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.జెఎన్‌టియులో.. జెఎన్‌టియుజివిలో అంబేద్కర్‌ చిత్రపటానికి విసి కె.వెంకటసుబ్బయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ కోఆర్డినేటర్‌ ఎం.సౌభాగ్యలక్ష్మి, ప్రొఫెసర్‌ జి.జయసుమ, రిజిస్ట్రార్‌ కె. బాబు పాల్గొన్నారు.విజయనగరం కోట : బాలాజీ జంక్షన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అది గజపతిరాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, పిల్లా విజరుకుమార్‌, జనసేన నాయకులు రౌతు సతీష్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యాన.. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకరి సతీష్‌ కుమార్‌, నాయకులు కొణతాల రమాదేవి, దేవుపల్లి సూరప్పడు, కరీం, రెహమాన్‌, కోట్ల మోహన్‌, సిహెచ్‌ చంద్రశేఖర్‌ ,మామిడి అప్పారావు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత.. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

➡️