క్రికెట్‌ టోర్నీ విజేత ఎఎంసి

May 27,2024 00:06 #cricket tournament
Tarluvada, Cricket tournament

 ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఆంధ్ర మెడికల్‌ సెంటర్‌, విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, డయాగ్నొస్టిక్‌ డ్రాగన్స్‌ ఆధ్వర్యాన క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను వైసిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకట్రావు ప్రారంభించారు. ఈ పోటీలలో ఎఎంసి జట్టు విన్నర్‌గానూ, డిడి జట్టు రన్నర్‌గాను నిలిచాయి. వీరికి మజ్జి వెంకట్రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. యువకులు క్రీడల్లో రాణించాలన్నారు. మన స్వచ్ఛంద సంస్థలు యువకులను ప్రోత్సహించి మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మజ్జి రమేష్‌, ఓం సుఖీభవ మెడికల్‌ షాప్‌ అధినేత కోరాడ ఆదినారాయణ, ఎంపిటిసి మాజీ సభ్యులు సూరిబాబు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

➡️