దాతల సహాయం అభినందనీయం

రగ్గులు ఇస్తున్న హెచ్‌ఎం రామారావు

 

ప్రజాశక్తి-రావికమతం:అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మండలంలో మేడివాడ జడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. 50 మంది దివ్యాంగ విద్యార్థులకు వడ్డాది గ్రామానికి చెందిన దొండా చంద్రమౌళి, పద్మావతి దంపతులు పది వేల విలువైన రగ్గులను అందజేశారు.దివ్యాంగ విద్యార్థులకు పరుగుల పందెం, మ్యూజికల్‌ చైర్‌, వీల్‌ చైర్‌ బాల్‌ గేమ్‌ వంటి క్రీడలు నిర్వహించి విజేతలకు ప్రధానోపాధ్యాయులు వి.రామారావు, తెలుగు ఉపాధ్యాయులు గెంజి నాగేశ్వరరావు, స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు జగన్నాథ నాయుడు, సరోజిని చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మండలంలో దృష్టి, వినికిడి లోపం గల ఐదుగురు దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్‌ ట్యాబ్‌లను అందజేశారు.ప్రధానోపాధ్యాయులు వి.రామారావు మాట్లాడుతూ, దివ్యాంగులకు దాతలు సహాయం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మావతి, నాగమణి, శాంతి, శ్యామల, బాలరాజు, రమణాజీ గోవిందరావు, నాగేశ్వరరావు, జగన్నాథనాయుడు పాల్గొన్నారు.

➡️