తాళ్ళపాలెంలో తప్పిన పెను ప్రమాదం

Apr 3,2024 10:45 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం తాళ్ళ పాలెం జంక్షన్ జాతీయ రహదారి పై బుధవారం తెల్లవారు జామున రెండు లారీలు ఢీ కొన్నాయి. విశాఖపట్నం నుండి మాకవరపాలెం కంపెనీకి వెళ్తున్న లారీ, రాజమండ్రి నుండి విశాఖపట్నం ఇసుక లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జాతియ రహదారి కావడంతో ఎక్కువ సంఖ్యలో రెండు వైపులా వాహనాలు వస్తూ ఉంటాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏదో జరిగిందని ఆందోళన చెందారు. మనుషులకు గాయాలు కాకపోవడం పట్ల ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి కశింకోట సిఐ వినోద్ బాబు పరిశీలించారు.

➡️