రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం

Mar 20,2024 10:45 #anakapalle district

ప్రజాశక్తి – బుచ్చయ్య పేట : మండలం కేంద్రం బుచ్చయ్యపేట ఆదివారం చెరకు తోటలో మంటలు అర్పుతుండగా మంటలు చెలరేగడంతో కాలి పోయి మృతి చెందిన సుంకర పోతురాజు కుటుంబనకు గోవాడ చక్కర ఫ్యాక్టరీ రైతు సంక్షేమ నిధి నుండి మంజూరు చేసిన నగదు బుధవారం బుచ్చయ్య పేటలో షుగర్ ఫ్యాక్టరీ సిడివో రామం మృతుని భార్యకు రూ 5000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుండి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతగా రైతు సంక్షేమ నిధి నుండి నగదు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ మెన్లు హరిహరరావు, వేపాడ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

➡️