రహదారులకై మానవహారాలు

Feb 12,2024 15:47 #anakapalle district
protest for Highways

అనకాపల్లి అచ్యుతాపురంలో పునర్నిర్మాణానికి నినాదాలు
ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే శిథిలావస్థకు చేరిన ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని, భారీ వాహనాలు రాకపోకలు అరికట్టాలని, అధిక బరువుతో కూడిన లారీలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారము అచ్యుతాపురం, మునగపాక మండలాల పరిధిలో పలు గ్రామాలలో రహదారులపై నిల్చుని నినాదాలు చేశారు. కార్మికులు కర్షకులు మహిళలు భారీ స్థాయిలో రహదారులపై నిల్చుని మానవహారం చేయి చేయి కలిపి మానవహారంగా నిలుచున్నారు.. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సిపిఎం పార్టీ చేపట్టిన ఈ రహదారి పునర్నిర్మాణ ఆందోళన కార్యక్రమానికి స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ఈ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించి పలు వాహనదారులు ప్రయాణికులు సంఘీభావం తెలిపారు. గోతులు పడిన రహదారిని వెంటనే పక్కాగా నిర్మించాలని డిమాండ్ చేశారు. అచ్చుతాపురం మండల కేంద్రంలో మరియు కొండకర్ల జంక్షన్లో , హరిపాలెం గాంధీ బొమ్మ ఆవరణలో తిమ్మరాజుపేట దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవరణలో తదితర గ్రామాల్లో ఈ ఆందోళన కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి అనకాపల్లి అచ్చుతాపురం రహదారి పునర్నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్ కాండ్రేగల రామ సదాశివరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ రాము, కర్రీ అప్పారావు, బు ద్ద రంగారావు, కె సోమ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు శరగడం శివ బాపు నాయుడు, కాండ్రేగుల సూర్యనారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి బుద్ధ రామ్ కుమార్, చొప్ప రమణ, రేవిడి కృష్ణ, ఆడారి రామకృష్ణ, కాండ్రేగుల రామ అప్పలనాయుడు, మహిళలు, యువతలు, ఆటో యూనియన్ నాయకులు, అనేకమంది రహదారిపై నుంచుని నినాదాలు చేశారు.

➡️