‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేద్దాం : కలెక్టర్‌

క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌, మస్కట్‌ లోగోను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

      అనంతపురం కలెక్టరేట్‌ : ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌కు సంబంధించి క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌, మస్కట్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 15 సంవత్సరాలు పైబడిన యువతను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, క్రీడల ప్రాముఖ్యతను తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా పోటీలను గ్రామీణ, వార్డు, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తోందన్నారు. డిసెంబర్‌ 15 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖోతోపాటు పోటీలేని క్రీడలు యోగా, టెన్నికాయిట్‌, మారథాన్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలు మొదటిగా గ్రామ/వార్డు స్థాయిలో తరువాత మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామన్నారు. పోటీల నిర్వహణకు సంబంధించిన క్రీడా సామగ్రిని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అన్ని సచివాలయాలకు అందిస్తుందని చెప్పారు. ఇందులో పాల్గొనాలనే క్రీడాకారులు 15 సంవత్సరాలు పైబడిన పురుషుల, మహిళలు వారి సమీపంలోని సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్‌ ష్ట్ర్‌్‌జూ://aaసబసaఎaఅసష్ట్రతీa.aజూ.స్త్రశీఙ.ఱఅ/శ్రీశీస్త్రఱఅలోనూ రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు. రిజిస్టర్‌ కోసం 1902 నంబర్‌కి కాల్‌ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్‌ కార్యాలయం డిఎస్డిఒ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️