‘ఆడుదాం ఆంధ్ర’లో బుక్కరాయసముద్రం జట్టు విజయభేరి

'ఆడుదాం ఆంధ్ర'లో బుక్కరాయసముద్రం జట్టు విజయభేరి

విజయం సాధించిన బుక్కరాయసముద్రం మండల జట్టు

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం

ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం మహిళా జట్టు అప్రహత విజయాలతో విజయభేరి మోగించి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీల్లో శింగనమల నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గం జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇందులో భాగంగా గురువారం అనంతపురం సమీపంలో ఉన్న అనంత క్రీడా మైదానంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్‌ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శింగనమల నియోజకవర్గ మహిళల క్రికెట్‌ జట్టు నిర్ణీత10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన రాయదుర్గం నియోజకవర్గ మహిళల క్రికెట్‌ జట్టు 3 వికెట్లను నష్టానికి కేవలం 71 పరుగులు మాత్రమే సాధించి 36 పరుగుల తేడాతో శింగనమల నియోజకవర్గం జట్టు విజయం సాధించింది. విజేత జట్టు ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌డిఒ నరసింహారెడ్డి, పీడీలు గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంపైర్లు రాగేష్‌, ముస్తఫా, లక్ష్మీనారాయణ, బాస్కెట్‌బాల్‌ కోచ్‌ వంశీ, తదితరులు పాల్గొన్నారు.

➡️