కూటమి భారీ గెలుపుతో మెజారిటీ పట్ల డిప్యూటీ సీఎం అభినందన

రాయదుర్గం (అనంతపురం) : ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కంటే రాయదుర్గం నియోజకవర్గం లో కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం పట్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన నాయకులు పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపినట్లు జనసేన పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్‌ కరేగౌడ్ర మంజునాథ్‌ గౌడ్‌ తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి వచ్చిన పిలుపుమేరకు తాను మంగళవారం డిప్యూటీ సీఎం కలిసి ఎన్నికలలో చేసిన కఅషిని వివరించినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తో 10 నిమిషాలపాటు మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా గురించి చర్చించినట్లు తెలిపారు . రాయదుర్గం నియోజకవర్గం 42 వేల భారి మెజారిటీ గురించి కాలవ శ్రీనివాసులుకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు.

➡️