ఆదర్శప్రాయుడు అంబేద్కర్‌

అనంతపురంలో అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తదితరులు

        అనంతపురం కలెక్టరేట్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ భావితరాలు, సమాజానికి ఆదర్శప్రాయుడని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు అన్నారు. బుధవారం అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పరిషత్‌ ఎదుట ఉన్న అంబద్కేర్‌ విగ్రహం వద్ధ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరజమ్మ, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఆర్‌టిసి రీజనల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమా మోహన్‌రెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.సుబ్బరత్నమ్మ, మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో అంబద్కేర్‌ విగ్రహానికి నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్‌, నాయకులు జీవరత్నం, రాజా, పుల్లన్న, నగర అధ్యక్షులు అక్కులప్ప, శివ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. టిడిపి అనంతపురం అర్భన్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షులు సాకే వెంకటేష్‌, నగర ప్రధాన కార్యదర్శి చిర్రోళ్ల రామాంజనేయులు, నగర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, టిడిపి నగర అధ్యక్షులు మారుతి కుమార్‌ గౌడ్‌, ఎస్సీ సెల్‌ నాయకులు శ్రీకాంత్‌, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దళిత రత్న ఎం.ఓబులేసు, నాయకులు గడ్డం ముత్యాలప్ప, సురేష్‌, తిమ్మరాజు, శివలింగమూర్తి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఈఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నారాయణనాయక్‌, రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఓబులేసు, బి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️