గ్రామాల్లో పోలీసుల కవాతు

గ్రామాల్లో పోలీసుల కవాతు

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

పుట్లూరు : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సిఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహినంచారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని శనగల గూడూరు, పుట్లూరు, మడుగుపల్లి, కడవకల్లు, కొండాపురం గ్రామాల్లో బిఎస్‌ఎఫ్‌, సివిల్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు కవాతు నిర్వహించి ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ హేమాద్రి, పుట్లూరు పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️