ఛార్జిమెమోలు ఉపసంహరించుకోవాలి

ప్రతిజ్ఞ చేస్తున్న యుటిఎఫ్‌నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఇచ్చిన ఛార్జీమెమోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో జిల్లా అధ్యక్షులు లింగమయ్య అధ్యక్షతన యుటిఎఫ్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక నేరాలు చేసేవారికి విధించే శిక్షలు ప్రయోగిస్తూ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, పాఠశాలలో ఏ పొరపాటు జరిగినా ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడం తగదన్నారు. విద్యార్థులకు చదువు రాకపోవడానికి కారణాలు విశ్లేషణ చేయకుండా, పాఠశాలలపై దాడి చేయడం తగదన్నారు. తక్షణం ఛార్జిమెమోలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అలాగే మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను వెంటనే నిర్వహించాలని కోరారు. మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అన్ని పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక యుటిఎఫ్‌ అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షులుగా ఎస్‌వివి.రమణయ్య, జిల్లా అధ్యక్షులుగా వి.గోవిందరాజులు, జిల్లా సహాధ్యక్షులు ఆర్‌.రామప్పచౌదరి, ఎన్‌.సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.లింగమయ్య, జిల్లా కోశాధికారి ఎం.రాఘవేంద్ర, కార్యదర్శులు బి.జీ.ప్రమీల, వి.అర్జున్‌, ఎన్‌.హనుమంత రెడ్డి, పి.అబ్దుల్‌ వహాబ్‌ ఖాన్‌, బి.సంజీవ్‌ కుమార్‌, హెచ్‌.రవికుమార్‌, రఘురామయ్య, కె.శేఖర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌లు సి.లింగమయ్య, వి.గోవిందరాజులు, ఎన్‌.దేవేంద్రమ్మ, పి.ఈశ్వరయ్య, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ వి.సుబ్బరాయుడు, మెంబర్స్‌ వై.వెంకట్రామిరెడ్డి, ఎం.రాజేంద్ర, ఎన్‌.ఓబులేసు, ఎం.చిత్తప్ప, బి.గంగాధర్‌, జి.రామాంజనేయులు, జి.సూర్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

➡️