జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆధునీకరణకు ఆమోదం

సమావేశంలో మాట్లాడుతున్న ఉపకులపతి రంగాజనార్ధన

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆధునీకరణకు జెఎన్‌టియు ద్వితీయ ఫైనాన్స్‌ కమిటీలో ఆమోదం లభించిందని ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. మంగళవారం స్థానిక విసి కాన్ఫరెన్స్‌ హాలులో ద్వితీయ ఫైనాన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విసి తెలిపారు. ముఖ్యంగా ఎల్లోరా భార్సు హాస్టల్‌ రెన్నోవేషన్‌, మరమ్మతులకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, పాలకమండలి సభ్యులు డి.హరిచంద్ర రామ, బి.దుర్గాప్రసాద్‌, అంజలీ జేమ్స్‌ పాల్గొన్నారు

➡️