నేడు జయహో బీసీ సదస్సు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభాకర్‌చౌదరి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

నేడు నగరంలో నిర్వహించనున్న బయహో బిసి సదస్సును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు. ఈమేరకు నేడు నగరంలోని 5వ రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద నిర్వహించనున్న బిసి సదస్సు వేదికతోపాటు 18న ఎన్టీఆర్‌ వర్థంతి నిర్వహించే లలిత కళాపరిషత్‌లో వేదిక, 20న గుత్తి రోడ్డులోని జికెఎం ఫంక్షన్‌ హాలులో నిర్వహించే ముస్లిం మౌనారిటీ సదస్సు వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపితోనే బిసిల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇందులో భాగంగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’లో బీసీల రక్షణ చట్టం తెచ్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కావున బిసిలంతా ఏకతాటిపైకి వచ్చి టిడిపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా 18న ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని లలిత కళాపరిషత్‌లో రక్తదాన శిబిరంతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, 20న ముస్లిం మైనారిటీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సీనియర్‌ నాయకులు సాలార్‌బాషా, నారాయణస్వామి యాదవ్‌, సరిపూటి రమణ, దలవాయి వెంకట్‌ నారాయణ, సిమెంట్‌ పోలన్న, సుధాకర్‌యాదవ్‌, డిస్కో బాబు, జెఎం.బాషా, మార్కెట్‌ మహేష్‌, పోతుల లక్ష్మీనరసింహులు, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.అనంతపురం : జయహో బిసి సదస్సును జయప్రదం చేయాలని టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దలవాయి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని అర్బన్‌ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని 5వరోడ్డు షిరిటీ సాయిబాబా ఆలయం వద్ద బిసి జయహో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు పోతుల లక్ష్మీనరసింహులు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

➡️