పాత పెన్షన్‌ పునరుద్ధరించే పార్టీకే మా మద్దతు : యుటిఎఫ్‌

పాత పెన్షన్‌ పునరుద్ధరించే పార్టీకే మా మద్దతు : యుటిఎఫ్‌

బుక్కరాయసముద్రంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు

పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు రామప్పచౌదరి, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని భగత్‌సింగ్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 6వతేదీ నుంచి చేపట్టనున్న ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగి జీవిత కాలం పని చేసి, పదవీ విరమణ తర్వాత భద్రత కోసం సాధించుకున్న పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, సిపిఎస్‌, జిపిఎస్‌ అంటూ పాలక ప్రభుత్వాలు ఉద్యోగి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరైతే పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తారో ఆ పార్టీకే ఉపాధ్యాయులు ఓటు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు అర్బన్‌ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, రాజకుమార్‌, రూరల్‌ శాఖ ప్రధాన కార్యదర్శి కల్పన, వజ్రకరూరు మండల శాఖ అధ్యక్షులు పావన మురళి, నాయకులు శంకరయ్య, యల్లన్న, రఫీ, చిన్న రంగన్న, రేవన సిద్ధయ్య, సుధాకర్‌, తిమ్మారెడ్డి, మారుతీప్రసాద్‌, వెంకటేశులు, గిరి, మాధవి, రాజ్‌కుమార్‌, మహబూబ్‌బాషా, రాంబాబు, రమేష్‌, రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఎంఇఒ కార్యాలయంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎంవివి రమణయ్య మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ లింగానాయక్‌, యుటిఎఫ్‌ నాయకులు దేవేంద్రమ్మ, మహమ్మద్‌గౌస్‌, పవన్‌కుమార్‌, సుబ్బరాయుడు, నాగేంద్ర, నారాయణప్ప, రమేష్‌, జగదీష్‌, అనురాధ, విజయలక్ష్మి, నాగరత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️