మెగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలి

మెగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలి

ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ లక్ష్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎప్‌ఐ నేతలు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలో 2016లో డిగ్రీలో చేరిన విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్యను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూశ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో మెగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం అనంతపురంలోని ఎస్‌కెయులో రిజిస్ట్రార్‌ లక్ష్మయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ఎస్‌కెయుకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2015 సెమిస్టరీ పద్ధతి ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి దాకా సప్లిమెంటరీ రాస్తున్న విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని కోరారు. సప్లిమెంటరీ పరీక్ష కోసం 4600 మంది విద్యార్థులతో పరీక్ష ఫీజు కట్టించుకుని పరీక్ష నిర్వహించలేదన్నారు. కావున మెగా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు తరిమెల గిరి, సిద్ధూ, సహాయ కార్యదర్శి అశోక్‌, ఎస్కెయూ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు శీవారెడ్డి, వంశి, మోహన్‌, విజయ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️