రాయదుర్గంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

రాయదుర్గంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

మాట్లాడుతున్న స్టీల్‌ ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షులు బిఎం నాథల్‌

ప్రజాశక్తి-రాయదుర్గం

రాజకీయ పార్టీల నాయకులు రాయదుర్గం నియోజకవర్గంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని స్టీల్‌ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షులు బిఎం.నాథల్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని సమైక్యాంధ్ర భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రాయదుర్గం నియోజకవర్గంలో కుదురేముఖ్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఒప్పందాలు జరిగినా అమలుకు నోచుకోలేదన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు నియోజకవర్గంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కొట్రేష్‌, మహిళా సమాఖ్య నాయకురాలు పార్వతి, పిడిఎస్‌యు, ఆల్‌ మెగా చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️