చిన్నారులను పనిలో పెడితే చర్యలు

చిన్నారులను పనుల్లో పెట్టరాదని, అలా పెట్టినవారిపై చర్యలు తప్పవని

కోటబొమ్మాళి : వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

కోటబొమ్మాళి:

చిన్నారులను పనుల్లో పెట్టరాదని, అలా పెట్టినవారిపై చర్యలు తప్పవని టెక్కలి సహాయ కార్మిక అధికారి ఆర్‌.రాధాకుమారి, జిల్లా బాలల రక్షణ విభాగం కౌన్సిలర్‌ డి.సీతారాములు, ఎంఇఒ ఎస్‌.అప్పలరాజులు హెచ్చరించారు. చైల్డ్‌ ఆర్‌ఎంటిలు, పార్ట్‌ టైం ఇనస్ట్రక్టర్లు సంయుక్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సోమవారం ర్యాలీ నిర్వహించారు. అలాగే దుకాణాలు, హోటళ్లకు వెళ్లి బాలలను పనిలో పెట్టరాదని సూచించారు. పిల్లలందరూ బడికి వెళ్లి చదువు అభ్యసించి, వారి భవిష్యత్‌కు చక్కటి మార్గాలు వేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల పేదరికం, ఇతర కారణాల వాళ్ల పిల్లలను పనిలో పెట్టరాదని, బడిఈడు పిల్లలను పాఠశాలకు మాత్రేమే పంపాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ ప్రతినిధి నాయుడు, హెచ్‌సికె గణేష్‌ పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలిసరుబుజ్జిలి : బడిఈడు పిల్లలు బయట తిరగకుండా బడిలో చేరాలని ఎంఇఒలు కె.శ్రీనివాసరావు, డి.బాలరాజులు తెలిపారు. మండలంలోని కొత్తకోటలో బడికి పోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వ శిక్షా అభియాన్‌ ఆదేశాల మేరకు జూలై 12 వరకు ఈ కార్యక్రమం ద్వారా బడిబయట ఉన్న పిల్లలను గుర్తిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ పైడి మురళీకృష్ణ, సిఆర్‌ఎంటిలు చిన్నారావు, చిరంజీవి, రోహిణి, రామినాయుడు పాల్గొన్నారు.

 

➡️