రేపు జగనన్న భూ పంపిణీ కార్యక్రమం

జగనన్న భూ పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ తదితరులు

       పెద్దపప్పూరు : మండలం పరిధిలోని అశ్వర్థ నారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలోని కళ్యాణమండపంలో శుక్రవారం నాడు జగనన్న భూపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్‌ లక్ష్మీకాంత్‌ నాయక్‌ తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సమావేశ ప్రాంగణ ప్రాంతాన్ని మండల అధ్యక్షులు రామిరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ అమర్నాథ్‌ రెడ్డి, అశ్వర్థ నారాయణస్వామి దేవస్థానం ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి, రఘునాథ్‌ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం తహశీల్దార్‌ విలేకరులతో మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గస్థాయి భూ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు భూపంపిణీ చేయునట్లు చెప్పారు. నియోజవర్గ స్థాయి లబ్ధిదారులందరూ శుక్రవారం నిర్వహించే జగనన్న భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️