వివోఏల సమస్యలపై వినతి

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న వీవోఏలు

         అనంతపురం కలెక్టరేట్‌ : వివోఏల కాలపరిమితి సర్కిలర్‌ను రద్దు చేయాలని వివోఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం.నాగమణి డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివోఏలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వివోఏల మెర్జ్‌ను ఆపాలన్నారు. 2021 నుంచి 15 సంఘాలు ఉన్న వివోఏలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నా రు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. రూ.20 లక్షల రూపాయలు ఇచ్చిన గ్రూపులకు వడ్డీ రాయితీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి రామకష్ణ, నాయకులు మనోహర్‌, షబానా తదితరులు పాల్గొన్నారు.

➡️