వైసిపి అరాచక పాలనపై తిరగబడదాం

మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న టిడిపి నాయకులు

మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పామిడి

వైసిపి అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ తిరగబడాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడుయాదవ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కొండాపురం గ్రామంలో ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను వివరించడంతోపాటు టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల వైఇసపి పాలనలో దోపిడీలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. దందాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఏ ప్రాంతంలో చూసినా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకునే స్థాయికి వెళ్లారన్నారు. ఈనేపథ్యంలో మనమందరం సమిష్టిగా పోరాటం చేస్తూ వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడి, టిడిపి అధినేత చంద్రబాబును సిఎంను చేసుకుందాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల కన్వీనర్‌ ముసలిరెడ్డి, మాజీ ఎంపిటిసి బాలరాజు, నాయకులు మధుసూదన్‌, భాస్కర్‌, జయకుమార్‌, సునీల్‌, సురేష్‌, సునీల్‌, చంద్ర, సూర్యనారాయణ, మధు, శ్రీరాములు, పెద్దిరెడ్డి, సుంకన్న, ఓబులేష్‌, రామాంజనేయులు, భాస్కర్‌, రంగారెడ్డి, బాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️