షాక్ సర్క్యూట్ తో 40 ట్రాక్టర్ల వరిగడ్డి వాము దగ్ధం 

Apr 8,2024 11:09 #Anantapuram District

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పరిధిలో పాపం పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి షాక్ సర్క్యూట్ తో 40 ట్రాక్టర్ ల వరిగడ్డి వాము దగ్ధం అయింది. మండలంలోని పాపం పల్లి గ్రామానికి శ్రీనాథ్ రెడ్డి అనే రైతుకు సంబంధించిన గడ్డివాములు కావడంతో పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ స్టేషన్ సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. దాదాపు 6 లక్షల వరకు నష్టం జరిగింది అని రైతు వాపోయాడు. పాపంపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే రైతుకు సంబంధించిన గడ్డివాములు బాగా ఎండిపోవడంతో పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ స్టేషన్ సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. దాదాపు 6 లక్షల వరకు జరిగింది అని రైతు వాపోయాడు.

➡️