ఆకుల బాబు ఆధ్వర్యంలో నార్పలలో భారీ ర్యాలీ

Jun 12,2024 11:56 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన నార్పల్లో టిడిపి నాయకులు ఆకుల విజయ్ కుమార్ (ఆకుల బాబు) ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సెవెన్ హిల్స్ కళ్యాణ మండపం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. టిడిపి కార్యకర్తలు అభిమానులు బాణాసంచా పేలుస్తూ ఉత్సాహంగా డీజేల ముందు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆకుల విజయకుమార్ (ఆకులబాబు) మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టిడిపిని అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి అభినందనలు తెలిపారు. ర్యాలీ అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం ర్యాలీకి హాజరైన కార్యకర్తలకు, ఆకుల కుటుంబ అభిమానులకు కళ్యాణ మండపంలో విందు భోజనం ఏర్పాటు చేశారు ఆయనతోపాటు తెలుగుదేశం, జనసేన, బిజెపి, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆకుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

➡️