తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం

నేలమట్టమైన ఇల్లు

ప్రజాశక్తి-నార్పల

మండల పరిధిలోని గూగూడు గ్రామంలో కుళ్లాయప్పకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. రంగాపురం కుళ్లాయప్ప గూగూడులో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. తర్వాత రెండో అంతస్తు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం కూడా సుమారు 20 మంది కూలీలతో రెండవ అంతస్తు స్లాబ్‌ వేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో కూలీలు భోజనానికి వెళ్లారు. ఈ సమయంలో ఉన్నట్టుండి భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కూలీలు భోజనానికి వెళ్లకుండా ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు.

➡️