పార్టీ ఏదైనా జిల్లాలో తగ్గని కురబల ప్రభావం 

Jun 13,2024 11:23 #Anantapuram District

రాష్ట్రమంత్రిగా పెనుగొండ శాసనసభ్యురాలు సవితమ్మ 

ప్రజాశక్తి-నార్పల : పార్టీ ఏదైనా అనంతపురం జిల్లాలో కురుబల ప్రభావం మాత్రం తగ్గలేదు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పెనుగొండ శాసనసభ్యులు కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ జిల్లా నుండి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహించగా శంకర్ నారాయణను మంత్రి పదవి నుండి తొలగించినప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన కళ్యాణ్ దుర్గం శాసనసభ్యురాలు ఉషాశ్రీ చరణ్ ను జిల్లా నుండి మంత్రిగా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ టిడిపి అభ్యర్థిగా పెనుగొండ శాసన సభ్యురాలుగా విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సవితమ్మకు మంత్రి పదవి వరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ ఏదైనా కురబల ప్రభావం ఏమాత్రం తగ్గలేదని పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన సవితమ్మకు నార్పల మండల కురువ యువ నాయకులు మల్లెల శివయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు.

➡️