అనంతకు ఎన్నికల పరిశీలకులు

ఎన్నికల పరిశీలకుడు నితిన్‌ అగర్వాల్‌కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌, ఎస్పీ

        అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులు అనంతపురానికి గురువారం విచ్చేశారు. అనంతపురం జిల్లా పరిధిలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్‌ అగర్వాల్‌ బుధవారం మధ్యాహ్నం అనంతపురం చేరుకున్నారు. నగరంలోని పోలీస్‌ అతిథి గృహంలో ఉన్న ఆయన్ను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌ కుమార్‌ ఎస్పీ అమిత్‌ బర్దర్‌లు కలిసి పుష్పగుచ్చం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఎన్నికల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారు.

➡️