ఖర్చులు బారెడు..మద్దతు జానెడు

ప్రజాశక్తి-చాపాడు కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో పలు పంటల మద్దతు ధరలలో గతంలో కంటే ఏమాత్రం ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని అందుకు అనుగు ణంగా గిట్టుబాటు ధరలు పెరగలేదు. జిల్లాలో వరి ప్రధాన పంటగా ఉంది. ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి మొత్తం 3.20 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగవు తున్నాయి. ఖరీఫ్‌లో 1.56 లక్షల ఎకరాలకు పైగా, రబీలో 60 వేల ఎకరాల్లో వరి పంట పండిస్తున్నారు. రెండు సీజన్లలో కలిపి మొత్తం 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తోంది. రైతుల సొంత అవసరాలకు పోనూ 4 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు అమ్ముతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులుపంటల సాగు చేసేందుకు రైతులకు పెట్టుబడి భారీగా పెరిగిపోతోంది. పెరిగిన పంట ఖర్చులు గతేడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లో దుక్కులకు రూ.6500 ఉంటే, ప్రస్తుతం రూ.ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు. పురుగు మందుల కోసం గతేడాది రూ.2,500 ఖర్చు చేయగా, ప్రస్తుత సంవత్సరంలో రూ.మూడు వేల వరకు పెరిగింది. కూలీల కోసం గత ఖరీఫ్‌లో రూ.7,500 వేలు ఖర్చు చేయగా, ఇప్పుడు రూ.ఎనిమిది వేలు దాటింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.110.68 ఉండగా డీజిల్‌ రూ.98.39 ఉందని, గతేడాదితో పోలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా పంట కాలంలో వినియోగిస్తున్న యంత్రాల అద్దెలు పెరిగాయంటున్నారు. గతేడాది మాదిరి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే, ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. కోత మిషన్‌ అద్దె, పొలం నుంచి ఇళ్లకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్ల అద్దెలూ పెరగాయని రూ.5,500 నుంచి రూ.6,500 వరకు ఉంటుంది.గతేడాదితో పోలిస్తే రూ.26 తక్కువకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవివిరుస్తున్నారు. వరికి క్వింటాకు రూ.117 మాత్రమే పెంచి చేతులు దులుపుకుందని గతేడాది రూ.143 పెంచగా, ఈసారి రూ.26 తగ్గించి ధర ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభు త్వం పెంచిన గిట్టుబాటు ధరలతో (క్వింటాల్‌) వరి (సాధారణ రకం) రూ.2,300, వరి (గ్రేడ్‌-ఎ) రూ.2,320, జొన్న (హైబ్రిడ్‌) రూ.3,371, జొన్న (మాల్దండి) 3,421, సజ్జలు రూ.2,625, రాగులు 4,290, మొక్కజొన్న రూ.2,225, వేరుశనగ 6,783, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280, నువ్వు లు రూ.9,267, సోయాబీన్‌ (పసుపు) 4,892, పెసలు రూ.8,682, పత్తి (మధ్యరకం) రూ.7,121, పత్తి (లాంగ్‌ స్టెపెల్‌) రూ.7,521, కంది రూ.7,550, మినుము రూ.7,400కి మాత్రమే చేరాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎరువులు, విత్తనాలపై రాయితీ క్రమేణా ఎత్తేస్తోంది. పంట ఖర్చులు పెరిగిన నేపథ్యం లో మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్న అన్న దాతలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది.తగ్గుతున్న సాగు విస్తీర్ణంగత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు గణనీయంగా తగ్గినది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగును మరింత పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో పులి వెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మల మడుగు తదితర ప్రాంతాలలో వేరుశనగ, వరి, శనగ తదితర పంటలు సాగు చేస్తారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలా పురం, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో వరితో పాటు పసుపు, మిరప, పత్తి, మొక్క జొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరి, చెరుకు, మామిడి, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌, ఇతర కూరగాయల పంటలు విరివిగా సాగు చేస్తారు. 2019 ఖరీఫ్‌లో 73,792 హెక్టా ర్లలో పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌లో 1,10,127 హెక్టార్లలో, 2021-22 ఏడాదుల్లో 1,24, 000 హెక్టార్లలో పంటలు సాగ య్యాయి. 2023లో సాగు గణనీయంగా తగ్గినది. 70 వేల హెక్టార్లకే పరిమితం అయినది.అధికమవుతున్న సాగు ఖర్చులు పసుపు పంట సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఖర్చు అవు తుంది. దిగుబడి మా త్రం 30 నుంచి 35 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది.. దుక్కిళ్ళ సమయంలో ధరలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలకు సాగు ఖర్చులు కూడా రావు. రూ.12 వేలకు పైగా పసుపు పంటకు ధరలు ఉంటే ఖర్చులు పోను కాస్త మిగులుతుంది .ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.- రామసుబ్బారెడ్డి, పసుపు రైతు, సీతారామపురం.ధరల్లో నిలకడ ఉండడం లేదు పంటలు సాగు చేసి అమ్మకాలు చేసే సందర్భంలో ధర లు తక్కువగా ఉంటు న్నాయి. రైతులు పూ ర్తిగా అమ్మకాలు చే పట్టిన తర్వాత ధరలు అమాంతం పెరు గుతు న్నాయి. ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించి, అది అమలు అయ్యేలా చూస్తే రైతు లకు ఉపయోగకరంగా ఉంటుంది. వరి ధాన్యం గత ఏడాది నూర్పిడి సమయంలో 8 బస్తాల ధర రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేలకు పైగా ధరలు పెరిగాయి. తీరా రైతులు అమ్మకాలు చేసే సందర్భంలో తిరిగి తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి వ్యత్యా సం లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి. – అబ్బిరెడ్డి, వరి రైతు, బద్రిపల్లి.గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలిప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో గిట్టు బాటు ధరలను ప్రక టిస్తూ చేతులు దులు పుకుంటున్నది. దీని ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. గిట్టుబాటు ధర కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నది. ప్రభుత్వం గిట్టుబాటు ధరను పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తే అందుకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది లేదంటే వ్యాపారాలు ఇష్టాను సారంగా కొనుగోలు చేపడుతారు. ప్రకటనల ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు.- దస్తగిరిరెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కడప.

➡️