అరెస్టు చేయడం సిగ్గుచేటు 

Jan 22,2024 13:13 #Anantapuram District
atp anganawadi arrest chalo vijayawada

ప్రజాశక్తి-పుట్లూరు : విజయవాడలో అంగన్వాడి యూనియన్ రాష్ట్ర నాయకులను ప్రజాసంఘాల నాయకులను సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేయడం చాలా బాధాకరం ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏపీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పుట్లూరు మండలం కడవకల్ వైఎస్ఆర్ సర్కిల్ నందు ఈ అక్రమ అరెస్టు నివసిస్తూ అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అరెస్ట్ చేసిన సిఐటియు ప్రజా సంఘాల నాయకుడు విడుదల చేయాలని అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కారంఅయ్యేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ అక్రమ అరెస్టుల వల్ల ఉద్యమాన్ని ఆపలేరని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె ఇలాగే కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సమన్వయ కమిటీ పుట్లూరు మండల కమిటీ
నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ సూరి రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట్ చౌదరి, రైతు సంఘం నాయకులు బి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సగం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య, నాగభూషణం, లక్ష్మీనారాయణ, ఓబులేసు, ఓబులయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️