హామీలను విస్మరించడం ‘బాబు’ నైజం : ‘అనంత’

హామీలను విస్మరించడం 'బాబు' నైజం : 'అనంత'

మహిళతో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

ఎన్నికల ముందు హామీలు ఇచ్చి విస్మరించడం టిడిపి అధినేత చంద్రబాబు నైజం అని అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. శనివారం నగరంలోని 14వ డివిజన్‌లో ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. చివరికి మేనిఫెస్టో కూడా కనిపించకుండా చేసిన ఘనుడు అని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కూటమి కట్టిన నేతల మాటలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉన్నాయన్నారు. ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్‌పై బీజేపీ భిన్నవైఖరి అవలంభిస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి డిప్యూటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ రాగే పరశురాం, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య, మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు మంజుల, అబూసాలెహా, చంద్రలేఖ, రాజేశ్వరి, జయలలిత, లావణ్య, సుజాత, చంద్రమోహన్‌, నరసింహులు, బాలాంజినేయులు, ఇషాక్‌, లక్ష్మీరెడ్డి, సుశీలమ్మ, ఉమామహేశ్వరి, సుగాలి పద్మావతి, రమేష్‌గౌడ్‌, రిలాక్స్‌ నాగరాజు, చింతా సోమశేఖర్‌రెడ్డి, సైఫుల్లా బేగ్‌, మదన్‌మోహన్‌రెడ్డి, శ్రీదేవి, కృష్ణవేణి, శ్రీనివాసులు, జాహ్నవి, వాసగిరి నాగ్‌, సాకే కుళ్లాయిస్వామి, వెన్నం శివారెడ్డి, చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, దాదా ఖలందర్‌, రాధాయాదవ్‌, విశాల, శోభబాయి, శోభారాణి, భారతి, సుభాషిణి, సుజాత, భానుమతి, ఉషా, ఉషారాణి, దేవి, ప్రమీల, సులోచన, పార్వతి, పద్మావతి, పద్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.పలువురు వైసిపిలో చేరిక తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ జిల్లా కార్యదర్శి రమణ టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు అనంత వెంకటరామిరెడ్డి స్వగృహంలో కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంతపురం రూరల్‌ పంచాయతీ రామకృష్ణ కాలనీకి చెందిన విజరుకుమార్‌, ఉదరు కుమార్‌, రాజేష్‌, పీరా, ఓబులేసు, సుబ్బారాయుడు తదితరులు వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు సుధాకర్‌రెడ్డి, హనుమంతురెడ్డి, హరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️