ప్రమాదంలో గాయపడిన విద్యార్థి  మృతి

Dec 30,2023 17:09 #Anantapur District
child death in hospital

 

మూడుకు చేరిన మృతుల సంఖ్య

మెరుగైన వైద్యం కోసం తీవ్రంగా గాయపడిన అభిషేక్ రెడ్డి బెంగళూరుకు తరలింపు

ప్రజాశక్తి-నార్పల :  మండల పరిధిలోని కేశేపల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన లారీ మోటార్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో గౌతమ్ విష్ణు అనే పదో తరగతి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా రాజకుల్లాయప్ప అభిషేక్ రెడ్డి అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని 108 ద్వారా అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మెరుగైన వైద్య సేవల కోసం విద్యార్థులను సవేరా ఆసుపత్రికి తరలించగా రాజకుల్లాయప్ప చికిత్స పొందుతూ మృతి చెందాడు అభిషేక్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాజకుల్లాయప్పకు శరీరం పైన ఎక్కడా గాయాలు కాకపోయినప్పటికీ తలలో బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. అనంతపురం సర్వజన ఆస్పత్రి ఆవరణ మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటి పోయింది తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నెన్నో కలలుకన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి విధి వైపరీత్యము ఏమో కానీ ప్రమాదంలో మృతి చెందిన గౌతమ్, విష్ణు, రాజ కుల్లాయప్ప లు ముగ్గురు వారి వారి తల్లిదండ్రులకు ఏకైక మగసంతానం కావడం మరింత బాధాకరం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి పోస్టుమార్టం చేయించి వారి వారి తల్లిదండ్రులకు విద్యార్థుల మృతదేహాలను అప్పజెప్పారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తల్లి ఆయన శ్యామలాదేవి సర్వజన ఆస్పత్రిలో నిరుపేదలైన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అన్నారు ప్రమాదం జరిగిన వెంటనే వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి తదితరులు శుక్రవారం రాత్రి సర్వజన ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించి గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేదలని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరస నాయుడు టిడిపి జిల్లా నాయకులు వెంకట నరస నాయుడు కోరారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను బంధువులను ఓదార్చారు విద్యార్థుల పోస్టుమార్టం అయిపోయే వరకు ఆసుపత్రి ఆవరణంలోనే ఉండి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని పలువురు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

➡️