పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి

పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి

సిబ్బందితో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ ఇబి.దేవి

ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌

గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్‌ ఇబి.దేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో గ్రామస్తులు వాంతులు, విరేచనాల బారినపడ్డ విషయం పత్రికల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన డిఎంహెచ్‌ఒ మంగళవారం నాగిరెడ్డిపల్లిని సందర్శించారు. ఇందులో భాగంగా వైద్య, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీశారు. అనంతరం తాగునీటి ట్యాంకు, పైప్‌లైన్‌ లీకేజీ, కొళాయిల వద్ద అపరిశుభ్రతను పరిశీలించి తగు సూచనలు చేశారు. వీధుల్లో మురికి కాలువలు శుభ్రం చేయాలని, ట్యాంకును శుభ్రం చేసుకోవాలని కోరారు. కోరినేషన్‌ పనులు చేయించాలని పంచాయతీ కార్యదర్శి కొల్లప్పను ఆదేశించారు. వాంతులు విరేచానాలు తగ్గుముఖం పట్టేదాకా గ్రామంలో హెల్త్‌ క్యాంపు నిర్వహించాలని ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సుజాత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఒ డాక్టర్‌ రవిశంకర్‌, ఎపిడమిక సెల్‌ కో ఆర్డినేటర్‌ వేమరెడ్డి, ఆవులదట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజేంద్రప్రసాద్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రామాంజనేయులు, ఎంఎల్‌హెచ్‌పి ప్రియాంక, ఏఎన్‌ఎం నాగమణి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️