పాఠశాల ఇక్కడ.. విద్యార్థులు ఎక్కడివారో?

Jul 3,2024 13:14 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలో మండలంలో స్థానికంగా ఉండే నిరుపేద విద్యార్థులకు, తల్లి తండ్రి లేని అనాధ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా అడ్మిషన్లు కల్పించాలని టిడిపి నాయకులు ప్రతాప్ చౌదరి బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో నార్పల మండల ఎంఈఓ లు కృష్ణయ్య, నారపరెడ్డిలను కోరారు. ఈ సందర్భంగా ప్రతాప్ చౌదరి మాట్లాడుతూ పేరుకే పాఠశాల ఇక్కడ ఉందని పాఠశాలలో స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల నుండి వేరే తాలూకాలు వేరే జిల్లాల నుండి విద్యార్థులను ఉన్నత అధికారుల ఆదేశాలు అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్చుకుంటున్నారు అని అప్పట్లో రాష్ట్ర ప్రాథమిక పాఠశాల విద్యా శాఖ మంత్రి రాష్ట్రంలో తల్లితండ్రులు లేని విద్యార్థినీలు నిరుపేద విద్యార్థినీయులు చదువుకు దూరం కాకూడదు అన్న సదుద్దేశంతో మండలానికి ఒక కస్తూర్బా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో నిబంధనల మేరకే స్థానికంగా ఉండే నిరుపేద అనాధ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. కాలక్రమంలో ఈ పాఠశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ కూడిన చక్కటి విద్యా బోధనతో పాటు అన్ని సౌకర్యాలు విద్యార్థినీయులకు రక్షణ బాగా ఉండటంతో ఈ పాఠశాలల్లో కూడా క్రమంగా పైరవీలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పైరవీలు ఉంటే తప్ప కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో అడ్మిషన్లు చిక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్పల మండల కస్తూర్బా గాంధీ పాఠశాలకు సత్యసాయి జిల్లా నుండి పలువురు విద్యార్థులను కేటాయించారని వారికి ఎలా అవకాశం కల్పిస్తారని స్థానిక ప్రజా ప్రతినిధులు తమను ప్రశ్నిస్తున్నారని కస్తూర్బా గాంధీ జిల్లా స్థాయి అధికారులతో విద్యాధికారి కృష్ణయ్య ఫోన్లో మాట్లాడగా విద్యార్థులు ఏ ప్రాంతం వారైనా కస్తూర్బా గాంధీ పాఠశాలలలో సీట్ల కనుగుణంగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని స్థానికంగా తల్లిదండ్రులు లేని వారు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకొని ఉంటే అటువంటి వారికి ఎవరికైనా పొరపాటున సీట్లు రాకపోతే కచ్చితంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపినట్లు ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు.

➡️