కూలిన కాలేజీ ప్రహరీ గోడ

Feb 14,2024 14:19 #Anantapuram District
Collapsed college wall

విరిగిపోయిన కాలేజీ గేట్ 

ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా మరినా నార్పల జూనియర్ కళాశాల

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ పడిపోవడానికి తోడు కాలేజ్ మెయిన్ గేట్ గత కొద్దికాలం క్రితం విరిగిపోవడంతో రాత్రి కాగానే కాలేజ్ అవవర్ణం మొత్తం ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారిపోతుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన నార్పలలో ఉంటున్న జూనియర్ కళాశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయి విద్యార్థులు కనీసం కూర్చోవడానికి కూడా గదులు లేకపోవడంతో పలువురు పూర్వ విద్యార్థులు అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులతో కలిసి కాలేజీ దుస్థితి గురించి ఆర్డిటి సంస్థ వారికి తెలపడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్డిటి సంస్థ ఐదు సంవత్సరాల క్రితం సుమారు కోటి రూపాయలు వరకు ఖర్చు చేసి అధునాతనమైన భవనాలను నిర్మించారు. అప్పటినుంచి విద్యార్థులు చదువుకోవడానికి భావన సమస్య తీరిపోయింది. కానీ గత కొద్ది కాలం క్రితం కాలేజీ చుట్టూ దుగుమర్రి రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ పడిపోవడం కాలేజి మెయిన్ గేటు విరిగిపోవడంతో దాని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఆర్డిటి సంస్థ వారు దాదాపు కోటి రూపాయలు వెచ్చించి అధునాతనమైన భవనాలను కట్టిస్తే కనీసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి వాటిని పరిరక్షించుకోకపోతే ఎలా అంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు కాలేజీ ప్రిన్సిపాల్ స్థానిక సిబ్బంది సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కాలేజీ పరిసరాలను విద్యార్థులు చదువుకునే గదులను ఆకతాయిలు, మందుబాబులు ధ్వంసం చేయకముందే విరిగిపోయిన గేటును పడిపోయిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని, కోరుతున్నారు నార్పల జూనియర్ కళాశాల నూతన భవనాల నిర్మాణం పూర్తయిన తరువాత పూర్వ విద్యార్థులు కాలేజీ స్థితిగతుల గురించి వారు ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు అంటున్నారు.

➡️