అధికారుల ఆదేశాలు గాలికి 

Jan 19,2024 13:05 #Anantapuram District
cpi protest on water likage problem

ప్రజాశక్తి-పుట్లూరు:  మండల పరిధిలోని అరకటి వేముల గ్రామంలో పైప్ లైన్ పగిలిపోయి వృధాగా పారుతున్న సచివాల సిబ్బంది  పట్టించకపోవడంతో శుక్రవారం నీటిలో నిండిన రోడ్డుపై సిపిఐ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి ఓబులపత్తి అధ్యక్షతన పిచ్చి మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు చేశారు. అనంతరం మండల కార్యదర్శి  పెద్దయ్య మాట్లాడుతూ… పుట్లూరు మండలంలోని అరకటవేముల గ్రామం నందు గత పది రోజుల నుంచి త్రాగునీరు మెయిన్ పైప్ లైన్ పగిలిపోయి, గ్రామంలోని కొళాయిలకు నీళ్లు ఎక్కక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ సిబ్బంది ఊరు బయట ఉండడం వల్లనో లేకుంటే వారుగ్రామంలో ఏమి తిరుగుదాంలే అనుకున్నారో కానీ , వారికి ఇంటి పన్నులు వసూలు చేయడంలో మీద ఉన్న శ్రద్ధ గ్రామ సమస్యల మీద కూడా ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా సచివాలయం సిబ్బందిని అడిగారు. గ్రామంలో బోరు బావులలో నీరు పుష్కలంగా నీరు ఉన్న గ్రామ అధికారులు సక్రమంగా అందించడంలో విఫలమవుతున్నారు. నీటి సమస్య చలికాలం ఇలాగ ఉంటే, రానున్న వేసవికాలంలో నీటి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ మధ్య గ్రామంలో వికచిథ్ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఆ ప్రోగ్రాంకి మండల ఎంపిడివో  రావడం జరిగింది. ఈ పైప్ లైన్ పగిలిపోయిన సమస్య మేమే దగ్గరుండి ఎంపిడివో కి చూపించడం జరిగినది. మా ముందరే సచివాల సిబ్బందికి ఈ సమస్య వెంటనే పరిష్కరించండి అని చెప్పడం జరిగినది. ఎంపిడివో చెప్పి దాదాపు వారం, పది రోజులు అవుతున్న సచివాలయ సిబ్బంది ఆయన మాట కూడా లెక్క చేయడం లేదు. వెంటనే ఈ పైప్ లైన్ రిపేరు చేసి గ్రామంలో సక్రమంగా నీరు అందించకుంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.

➡️