గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jun 15,2024 08:43 #Anantapuram District

ప్రజాశక్తి -కళ్యాణదుర్గం రూరల్: స్థానిక శంకరప్ప తోట కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వివరాల మేరకు శంకరప్ప తోట కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఎవరైనా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు.

➡️