గూగూడులో శిలాఫలకాలు ధ్వంసం

Jun 15,2024 12:11 #Anantapuram District
  •  ధ్వంసం చేసిన చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని గుగుడు గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాల బోర్డులను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు సమీపించిన సమయంలో ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటువంటి అలజడి సృష్టించడం పద్ధతి కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల్లాయి స్వామి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు వస్తారని బ్రహ్మోత్సవాల సమీపించిన సమయంలో ఇటువంటి సంఘటనలు గూగూడు గ్రామంలో జరగడం భక్తులపై ప్రభావం చూపుతోందని ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఆధ్యాత్మిక గ్రామమైన గుగూడులో ఇటువంటి సంఘటనలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడడంతో పాటు స్వామి దర్శనానికి రావడానికి సైతం భక్తులు భయపడతారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చూడాలని పలువురు గూగూడు గ్రామస్తులు కోరుతున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️