పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి 

Jun 14,2024 11:32 #Anantapuram District

నార్పలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారం

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పల ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం నార్పల లో ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ ప్రచారం చేస్తున్నారు గతంలో ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది కార్పొరేట్ పాఠశాలల సిబ్బంది మా పాఠశాలలో ఈ సౌకర్యాలు ఉన్నాయి ఆ సౌకర్యాలు ఉన్నాయి అంటూ ప్రచారాలు నిర్వహించడం చూసే వారం నేడు దానికి భిన్నంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉన్నాయని సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తారని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల మాటలు విన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు నార్పల ప్రభుత్వ ఉపాధ్యాయులు నార్పల లో ప్రచారం చేస్తూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉపాధ్యాయులు లిగన్న, నర్సింహులు,శ్రీవాణి,మెహతజ్ తదితరులు పాల్గొన్నారు..

➡️