సామాజిక మాధ్యమాల్లో పెట్రేగిపోతున్న విమర్శలు

Mar 17,2024 13:39 #Anantapuram District

ఆందోళన చెందుతున్న స్థానికులు

ప్రజాశక్తి-నార్పల : 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మండల కేంద్రం అయిన నార్పల లో సామాజిక మాధ్యమాల్లో పలు పరోక్ష విమర్శలు పెట్రేగిపోతున్నయి దీంతో ప్రశాంత మండలంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని పలువురు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 30 సంవత్సరాల క్రితం 1995లో నార్పల మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రమైన నార్పల్లో ఫ్యాక్షన్ పెట్రేగిపోయి చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి భార్యా పిల్లలను కుటుంబ సభ్యులను వదిలి పెట్టి అజ్ఞాతవాసంలో గడపడం జైలుకు వెళ్లడం జరిగింది. అదంతా గతం కానీ. ప్రస్తుతం జిల్లా లొనే నార్పల మండలం ప్రశాంత మండలంగా పేరు పొందింది. దీనితో పలు వ్యాపారాలు చేసుకునే వారు వివిధ చేతి పనులు చేసుకునే వారితోపాటు వలస కూలీలు కూడా భారీ స్థాయిలో నార్పల కు వచ్చి స్థిరపడి ప్రతాంత జీవనం గడుపుతున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రాంతాల వారు సైతం నార్పలలో స్థిర చర ఆస్తులు కొంటున్నారు జిల్లాలోనే ఎక్కడా లేనివిధంగా మండల కేంద్రమైన నార్పలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లుతూ జిల్లా కేంద్రంలోనే లేని ప్లాట్ల రేట్లు సైతం నార్పలలో ఉన్నాయి. అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రెచ్చగొట్టే పరోక్ష విమర్శలు ఎటు పోయి ఎటు దారితీస్తాయోనని నార్పల్లో ఎక్కడ 1995 పరిస్థితిలు పునరావృతం అయితాయోనని పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయంలో ఒకరిని ఒకరు రెచ్చగొట్టే విమర్శలు, కవ్వింపు చర్యలు జరిగి గొడవలు జరిగేవి కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికలకే మండల కేంద్రం, గ్రామాల్లో ఇటువంటి చర్యలు జరగడం గమనార్హం.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, ప్రత్యక్ష పరోక్ష వార్నింగ్ ఇవ్వడం, అంతర్గత వివరాలు గురించి అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని సూచించారు. సోషల్ మీడియా లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని, అలాంటి వారిపై చట్టప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రా గ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకుని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేస్తే, తగిన చర్యలు తప్పవన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్ట్ ల ద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు.

➡️