పకడ్బందీగా వాహనాల తనిఖీ

పకడ్బందీగా వాహనాల తనిఖీ

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌

ప్రజాశక్తి-వజ్రకరూరు

కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ అమిత్‌ దర్బర్‌ సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని డొనేకల్లు, విడపనకల్లు, కర్నాటకకు చెందిన చేళ్లగుర్కి చెక్‌పోస్టులతోపాటు పాల్తూరు పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయా చెక్‌పోస్టుల్లో వెహికల్‌ మూమెంట్‌ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఎన్నికల వేళ కర్ణాటక నుంచి మద్యం, డబ్బు, ఎన్నికల తాయిలాలు అక్రమంగా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పార్శిల్‌, లగేజీ వాహనాలను చెక్‌ చేయాలన్నారు. అనంతరం పాల్తూరు పోలీసుస్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామాలు, తాజా పరిస్థితులు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కర్నాటక సరిహద్దుల్లో గ్రామాలు ఉండటం వల్ల పక్కాగా నిఘా కొనసాగించాలన్నారు. కర్నాటక లిక్కర్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. బైండోవర్లు సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. పాత నేర చరితులపై నిఘా కొనసాగించాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆవేశించారు. ఈ కార్యక్రమాల్లో ఉరవకొండ రూరల్‌ సి.ఐ ప్రవీణ్‌కుమార్‌, విడపనకల్లు, పాల్తూరు ఎస్‌ఐలు ఖాజాహుస్సేన్‌, హుస్సేన్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️