అక్షరాస్యత శాతం మరింత పెరగాలి

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో అక్షరాస్యత శాతం మరింత పెంచే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో డిఇఇ సెట్‌ – 2024, ఎస్‌ఎస్‌ఇ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ, ఎపిఒఎస్‌ఎస్‌ పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో బోధించి మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. డిస్ట్రిక్‌ ఎడ్యుకేషన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో జిల్లా, రాష్ట్రస్థాయి నిపుణులు ఉండాలన్నారు. పదవ తరగతి, ఇతర పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మరింత పెరగాలన్నారు. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు, సాంస్కతిక, వ్యాసరచన, వక్తత్వ తదితర ఎలాంటి పోటీలు జరిగినా జిల్లా విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణ ఇవ్వాలన్నారు. డిఇఇ సెట్‌, ఎస్‌ఎస్‌ఈ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ, ఎపిఒఎస్‌ఎస్‌ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్‌ఎస్‌ఈ అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు, మే – 2024కు సంబంధించి మే 24వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిఈఈ సెట్‌ – 2024కు సంబంధించి మే 24వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ పెట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, డిఇఒ వరలక్ష్మి, ప్రభుత్వ ఎగ్జామ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవింద నాయక్‌, డిఎంహెచ్‌ఒ డా||ఈబీదేవి, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్‌, లేబర్‌ డీసీ లక్ష్మీనరసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️