సామూహిక ఉద్యోగ విరమణోత్సవం

సామూహిక ఉద్యోగ విరమణోత్సవం

ఉద్యోగ విరమణ పొందిన వారితో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, అధికారులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ప్రతి ఉద్యోగి జీవితంలో చివరకు ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి. ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి వారి కార్యాలయాల్లోనే ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చేది. అలా కాకుండా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వినూత్నంగా ఆలోచించిన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా అన్నిశాఖల పరిధిలో ప్రతినెలా ఉద్యోగ విరమణ పొందుతున్న వారందరికీ కలెక్టరేట్‌లోనే శన్మాన కార్యక్రమం చేయాలని నిర్ణయించారు. అనుకున్న వెంటనే దాన్ని ఆచరణలో పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో ఉద్యోగ విరమణ పొందిన 70 మంది జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి అటెండర్‌, సిబ్బంది వరకూ మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సామూహిక ఉద్యోగ విరమణోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మా జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే సందర్భం అంటూ, జిల్లా కలెక్టర్‌ నిర్ణయం స్ఫూర్తిదాయకం అంటూ చప్పట్లతో అభినందనలు, కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ జి.రామకష్ణారెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి శ్రీనివాసులు, బీసీ వెల్ఫేర్‌ డీడీ కుష్బూకొఠారి, హెచ్‌ఎల్‌సి ఎస్‌ఈ రాజశేఖర్‌, కలెక్టరేట్‌ ఏవో అంజన్‌బాబు, జిల్లా మలేరియా అధికారి ఓబులు, ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్‌, శంకరయ్య, పీఆర్‌ ఎస్‌ఇ ఎర్రిస్వామి, తహశీల్దార్‌ నాగభూషణం, ఎంపిడిఓలు సుధాకర్‌బాబు, కమల్‌బాషా, ఏపీఆర్‌ఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కుళ్లాయప్ప, ఉద్యోగ విరమణ పొందిన వివిధ శాఖల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️