21 నుంచి నిరవధిక సమ్మె

Dec 16,2023 14:46 #Anantapuram District
municipal engineering workers strike notice

కమిషనర్ మేయర్లకు సమ్మె నోటీస్ అందజేత

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మి పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అందరినీ పర్మినెంట్ చేయాలని కోరుతూ ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు శనివారం మేయర్ వసీం కమిషనర్ భాగ్యలక్ష్మిలకు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు నాగభూషణం నాగరాజు తిరుమల స్వామి మల్లికార్జున సంజీవ రాయుడు మదమంచి లోకనాథ చౌదరి తదితరులు మాట్లాడుతూ
మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి-సమాన వేతనం, పర్మినెంట్ చేయాలని, సి.పి.ఎస్ రద్దు, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్- సెమీ స్కిల్డ్, హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కోవిడ్ మలేరియా గార్బేజ్ కార్మికులకు కనీస వేతనం రూ: 15000/- ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్యలు, పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారి పేర్లు తొలగించిన ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు. తదితర సమస్యల పరిష్కారం కోసం ఇదివరకే రాష్ట్ర కేంద్రంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కు రాష్ట్ర నాయకత్వం సమ్మె నోటీసు 15వ తారీఖున ఇవ్వడం జరిగింది అన్నారు. అందులో భాగంగానే శనివారం అనంతపురం నగరంలో కమిషనర్, మేయర్ మహమ్మద్ వసీం కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షలు ఏటీఎం నాగరాజు, ఎమ్మార్పీఎస్ సంఘం నాయకులు నల్లప్ప, సిఐటియు నగర అధ్యక్షులు ఎన్టీఆర్ శ్రీనివాసులు గురు రాజా, ప్రకాష్, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బండారి స్వామి, సాకే తిరుమలేశు, ఇంజనీరింగ్ విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున సంజీవ రాయుడు నగర అధ్యక్ష కార్యదర్శులు ఓబుళపతి కోశాధికారి, పోతులయ్య, సూర్య నారాయణ, మున్సిపల్ యూనియన్ నగర జిల్లా మహిళా నాయకులు మంత్రి వరలక్ష్మి, లక్ష్మీ నరసమ్మ, సర్దానమ్మ, కాంతమ్మ, లక్ష్మీదేవి, జయరాము, ఆదినారాయణ, ముత్యాలమ్మ, మరియమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొనడం జరిగింది.
.

➡️