సమ్మె హామీల జీవోలను విడుదల చేయాలి

Jan 27,2024 16:01 #Anantapur District
municipal workers protest

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

ప్రజాశక్తి-రాయదుర్గం : మున్సిపల్ కార్మికులు చేపట్టిన 16, రోజులు సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అందుకు సంబంధించిన జీవోలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున శనివారం కార్మికులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు అరగంట పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అందులో ప్రధానంగా కార్మికులకు 21 వేల రూపాయల నెలసరి జీతం,, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు స్కెల్డు, సెమి స్కిల్డు, సమ్మె కాలపు వేతనం, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, కార్మికుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయుట, పట్టణాల ప్రజలకు అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచుట, ఇతర అనేక హామీలను ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీల పై జీవోలు విడుదల చేయకపోవడంతో కార్మికుల్లో గందరగోళం భయాందోళన నెలకొందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇచ్చిన హామీల కు సంబంధించిన జీవోలను విడుదల చేయాలని లేని పక్షంలో ఈ జీవోల అమలు కొరకై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఉద్యమ బాట పట్టేందుకు సంసిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు తిప్పేస్వామి, మల్లేష్, సిద్ధ, వెంకటేశులు, ఆదిలక్ష్మి మరియు కార్మికులు పాల్గొన్నారు.

➡️