డిఎంఎల్‌టి స్టేట్‌ టాపర్‌గా నితిన్‌

డిఎంఎల్‌టి స్టేట్‌ టాపర్‌గా నితిన్‌

దబ్బర నితిన్‌చౌదరి

ప్రజాశక్తి-అనంతపురం

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్‌ కౌన్సిల్‌ నిర్వహించిన పారామెడికల్‌ కోర్సులోని డిప్లమో ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో అనంత యువకుడు దబ్బర నితిన్‌చౌదరి స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. రాష్ట్రంలో డిఎంఎల్‌టి కోర్సులో 23 మంది డిస్టెంక్షన్‌లో పాసయ్యారు. వీరిలో 9మంది అనంతపురంలోని సీడ్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హమని కళాశాల కరస్పాండెంట్‌ ప్రత్తిపాటి రంగనాయకులు తెలిపారు. రాష్ట్ర పారామెడికల్‌ చరిత్రలోనే 84.16 శాతం ఉత్తీర్ణతతో ఎక్కువ మార్కులు సాధించిన నితిన్‌ ఖ్యాతి పొందాడన్నారు. 2024లో స్టేట్‌ టాపర్‌గా నితిన్‌ నిలవడం చాలామందికి స్ఫూర్తిదాయకమన్నారు. స్టేట్‌ టాపర్‌ నితిన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కువ మార్కుల సంపాదించడానికి తమ కళాశాల ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్‌ రంగనాయకులు, తల్లిదండ్రులు ప్రోత్సాహమే కారణమన్నారు. ఈమేరకు విద్యార్థిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్‌ కళాశాల కరస్పాండెంట్‌ రంగనాయకులు, డైరెక్టర్‌ కార్తీక్‌, అధ్యాపకులు డాక్టర్‌ ఆదిరెడ్డి పరదేశీనాయుడు, భరత్‌, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️