జిల్లాకేంద్రంలో పోలీసుల తనిఖీలు

జిల్లాకేంద్రంలో పోలీసుల తనిఖీలు

శింగనమల మండలంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

అనంతపురం క్రైం : ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని చంద్రబాబు కొట్టాల, రామ్‌నగర్‌, నాయక్‌నగర్‌లలో ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నాటక లిక్కర్‌, డబ్బు, ఎన్నికల తాయిలాలు అక్రమంగా తరలించకుండా తనిఖీ కొనసాగిస్తున్నామని 4వ పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.పోలీసుల కవాతు

శింగనమల : ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర సాయుద బలగాలు కవాతు నిర్వహించాయి. ఇందులో భాగంగా మండల పరిధిలోని పెరవలి, పోతురాజుకాలవ, శివపురం, సి.బండమీదపల్లి గ్రామాల్లోని వీధుల్లో సిఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎఫ్‌ డీఎస్పీ ధర్మేంద్రసింగ్‌, పోలీసులు పాల్గొన్నారు.

➡️