29న ఎస్‌ఎఫ్‌ఐ మోడల్‌ ఎంసెట్‌

మోడల్‌ ఎంసెట్‌ కరపత్రాలను విడుదల చేస్తున్న జెఎన్‌టియు విసి

          అనంతపురం కలెక్టరేట్‌ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న మోడల్‌ ఎంసెట్‌ పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జెఎన్‌టియుఎ విసి జివిఆర్‌ శ్రీనివాసరావు తెలియజేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్‌ మాదిరి పరీక్ష పోస్టర్‌లను విసి శ్రీనివాసరావు, రిజిస్టర్‌ శశిధర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతుర్‌ పరమేష్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు అందరూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించే మోడల్‌ ఎంసెట్‌ను రాయాలన్నారు. అనంతపురం నగరంలోని పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏప్రిల్‌ 29 నుంచి మే 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆన్లైన్‌లో పరీక్ష రాసిన వెంటనే మార్కులు కంప్యూటర్స్‌ సిస్టంపై డిస్‌ప్లే అవుతాయన్నారు. పరీక్ష రిజిస్ట్రేషన్‌ కోసం ఎస్‌ఎఫ్‌ఐ అనంతపురం జిల్లా కమిటీ సభ్యులకు ఫోన్‌ 9052152256, 9347714968 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సిద్దు, భీమేష్‌, వంశీ, మోహన్‌, సోము, చంద్ర, గణేష్‌ పాల్గొన్నారు.

➡️