విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

Jan 24,2024 15:52 #Anantapuram District
tabs distribution to putluru

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అధికారులు ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమిరెడ్డి సునీత హాజరై 62మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము విద్యావ్యవస్థకు, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ప్రవేశ పెట్టి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందన్నారు. అనంతరం పాఠశాల పూర్వపు విద్యార్థులు సంఘం అద్యక్షుడు భూమిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందడుగులు వేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రేమ్ కుమార్, హెచ్ఎం విజయలక్ష్మి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భూమి రెడ్డి గారి నాగార్జున రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

➡️