కలెక్టర్ గౌతమిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్

Feb 12,2024 13:22 #Anantapuram District
The municipal chair person who met the collector Gauthami

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమిని  రాయదుర్గం  మున్సిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయదుర్గం పురపాలక కార్యాలయం నందు సెక్షన్ అధికారులు లేక అత్యవసర పనులకు, అభివృద్ధి పనులకు, తీవ్ర ఇబ్బందులు కలుగుచున్నది. వెంటనే రాయదుర్గం పురపాలక కార్యాలయం నందు అధికారులను నియమించవలసిందిగా చైర్ పర్సన్ కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పోరాళ్ళు శివ నిజాముద్దీన్, కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️