వైసిపిని గెలిపించుకొని తప్పు చేశామని అంగన్వాడీల ఆవేదన

Jan 21,2024 16:08 #Anganwadi strike, #Kurnool

ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు): ఒక్క సారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరినందుకు వైసిపిని గెలిపించుకొని తప్పు చేశామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష ఉపాధ్యక్షులు విశాలాక్షి భీమేశ్వరి లావణ్య లు ఆవేధన చెందారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో
అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 41 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు అయిన మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారూ మిమ్మల్ని గెలిపించుకొని తప్పు చేశామంటూ అంటూ చెంపలు వేసుకుంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ గత 41 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని మేము గొంతెమ్మ కోరికలు కోర్కెలు కోరడం లేదని మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాజ్యుటి అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీల పైన ఎలాంటి ప్రయోగాలు చేసినా రాబోయే కాలంలో ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

➡️